ఎవరు ఊహించని మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రం.. ఇక రచ్చ రచ్చే..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మొదట దర్శకుల లిస్ట్ లో వింపించే పేరు త్రివిక్రం. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలా సెట్ అయ్యింది. త్రివిక్రం కాకుండా పవర్ స్టార్ సినిమా చేయడం జరుగుతుంది కాని త్రివిక్రం తో సినిమా అనుకుంటే చాలు ఇద్దరు కలిసి చేసేస్తారు. ఇప్పటికే వకీల్ సాబ్ తో పాటుగా ఆరు సినిమాల దాకా కమిటైన పవన్ త్రివిక్రం తో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ కు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. అదికాకుండా మరో సినిమా ప్లానింగ్ లో ఉందా అంటే అవుననే అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం సినిమా ఒకటి డిస్కషన్స్ లో ఉందట. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని అంటున్నారు. త్రివిక్రం గురువుగా భావించే సరవంతి రవికిశోర్ రెడ్ ఈవెంట్ లో ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానం అందరికి అర్ధమైంది. అయితే ఆ చొరవతోనే రామ్, పవన్ కలిసి సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను రవికిశోర్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో హిట్ అందుకున్న రామ్ రానున్న సినిమాలతో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.

పవన్, రామ్ అసలు ఏమాత్రం ఊహించని ఈ కాంబో ఫిక్స్ అయితే మాత్రం సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. త్రివిక్రం డైరక్షన్ లోనే మెగా మల్టీస్టారర్ అదేనండి చిరు, పవన్ ఉంటుందని అంటున్నారు. మరి ఒక్క త్రివిక్రం ఇంతమందితో ఎలా మల్టీస్టారర్ చేస్తాడు. ఊరకనే అనుకుంటే సరిపోదు ఆ అంచనాలకు తగినట్టుగా కథ సిద్ధం చేసుకోవాలి కదా అని అంటున్నారు సినీ జనాలు.             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: