సరికొత్త లుక్ లో దర్శనమిచ్చిన ఈ హీరోని గుర్తు పట్టారా..మరీ ఇంతలా మారిపోయాడేంటి..??

Anilkumar
తెలుగులో మొదటగా  ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులకి హీరోగా పరిచయం అయ్యాడు రాజ్ తరుణ్..ఆ సినిమాలో పక్కా పల్లెటూరి చలాకీ కుర్రాడిగా కనిపించి ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా మంచి మార్కులు కొట్టేసాడు.. తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు..ముఖ్యంగా కుమారి 21F ,సినిమా చూపిస్తా మామ, ఈడో రకం, ఆడో రకం,  లవర్..ఈ సినిమాలు హీరోగా రాజ్ తరుణ్ కి మంచి క్రేజ్ తెచ్చాయి.. కానీ గత కొంత కాలంగా వరుస పరాజయాలను చవిచూస్తున్న సమయంలో...
 విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో సినిమా చేసి హిట్ అందుకున్నాడు.
 
అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రూపొందుతుంది.ఈ సినిమాను గత నెల 14న ప్రకటించారు. పవర్ ప్లే అనే పేరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలైందా లేదా అనేది కూడా ఎవరికీ తెలీదు. కానీ తాజాగా ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అంటూ అందరినీ షాక్‌కు గురిచేశారు. పవర్ ప్లే ట్రైలర్‌ను ఈ రోజు ఉదయం 9గంటల 15నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.అయితే దర్శకుడు విజయ్ 'పవర్ ప్లే' సినిమా కన్నా ముందు కన్నడలో 'రైడర్' అనే సినిమా చేస్తున్నాడు. మరి పవర్ ప్లే సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేశాడు అనేది తెలీదు.
 కానీ సినిమాను శరవేగంతో పూర్తి చేసి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యాడు ఈ యంగ్ హీరో.. ఈ సినిమాలో రాజ్ తరుణ్ పూర్తి భిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఇంతకు ముందు కేవలం లవ్, అండ్ ఫ్యామిలీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కూడా చేస్తూ.. తనలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.. మరో ఈ ప్రయత్నం ఏ మేర ఫలిస్తుందో చూడాలి..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: