ఆ రెండిటితో తానేంటో చూపిస్తాడట .....??
మంచి లవ్ కం ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది .కాగా ఈ సినిమా ఈ ఏడాది జూన్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అయితే దీని తరువాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ రోల్ ని అఖిల్ ఆ మూవీ లో పోషిస్తున్నట్లు టాక్.
ఇక ఆ పాత్ర కోసం ఇప్పటికే శారీరకంగా ఎంతో ఫిట్ గా తయారైన అఖిల్, అతి త్వరలో దానియొక్క ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించనున్నారని అంటున్నారు. మొత్తంగా చూసుకున్నట్లైతే అటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు ఇటు సురేందర్ రెడ్డి సినిమాలు రెండింటితో కూడా రెండు భారీ సక్సెస్ లు అందుకునేందుకు అఖిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ రెండు మూవీస్ తరువాత అఖిల్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవి అతడికి ఎంతవరకు సక్సెస్ అందిస్తాయో చూడాలి.....!!