రజినీ ఆరోగ్యం బాగోలేదు.. ఆ వార్త నిజమేనా..!

NAGARJUNA NAKKA
రజనీకాంత్‌ రెస్ట్‌ తీసుకుంటుంటే..  ఆయన గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. గతంలో మొదలుపెట్టగా ఆగిపోయిన ఓ సినిమాను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారనేది ఈ వార్త  సారాంశం. అటకెక్కిన 'రాణా' మూవీ  మళ్లీ సెట్స్‌పైకి వస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

రజనీకాంత్‌, కెఎస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో  2010లో రాణా అనే సినిమా మొదలైంది.  ప్రారంభోత్సవం జరిగిందో లేదో.. రజనీకాంత్‌ అనారోగ్యంతో ట్రీట్‌మెంట్ కోసం సింగపూర్‌ వెళ్లాడు. కొన్ని నెలల తర్వాత కోలుకున్న రజనీకాంత్‌ రాణా సినిమాను పక్కన పెట్టి.. ఇదే దర్శకుడితో లింగా చేశాడు.

రాణా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని కె.యస్‌ రవికుమార్‌ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆగిపోయిన ఈ మూవీ 2022లో సెట్స్‌పైకి వస్తోందంటూ వార్తలొస్తున్నాయి. యూనిట్‌సిబ్బందికి కరోనా రావడంతో.. రజనీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తే షూటింగ్‌ వాయిదా పడింది. దీనికి తోడు రజనీకాంత్‌కు బీపీ అప్‌ అండ్‌ డౌన్‌ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం..  రాజకీయాల నుంచే తప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో.. రాణా సినిమా చేసే అవకాశం వుంటుందా? అనే డౌట్‌ లేకపోలేదు.

రజనీకాంత్‌ అన్నాత్తే మూవీని ఫినిష్‌ చేయడమే గగనంగా మారింది.  ఇప్పట్లో షూటింగ్‌ పూర్తికావడం కష్టమని డిసైడ్‌ అయిన చిత్ర యూనిట్‌.. రజనీ డేట్స్‌ ఇచ్చినప్పుడు షూట్‌ చేసి  దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్‌ చేశారు. ఒకవేళ రాణాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని ఎదురుచూసిన అభిమానులే శత్రువులవుతారు.  అనారోగ్యకారణంగా రాజకీయాలనుంచి తప్పుకుని.. ఎలా నటిస్తారని ప్రశ్నిస్తారు. ఈలెక్కన రాణా మళ్లీ సెట్స్‌పైకి రావడం కష్టమే.

మొత్తానికి ఇన్నాళ్లూ మరుగున పడిపోయిన రాణా మళ్లీ వెలుగులోకి వస్తుందా అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. రజినీకాంత్, దీపిక పదుకునే హీరోహీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో అంచనాలున్నాయి. అయితే రజినీ ఆరోగ్యం బాగోలేనందున ఆయన మరో సినిమాకు కమిట్ కావాల్సి వచ్చింది. చూద్దాం.. మరి రాణా మళ్లీ సెట్స్ పైకి వస్తే రజినీ ఫ్యాన్స్ కు పండుగే పండుగ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: