ప్రభాస్ 'రాధే శ్యామ్' రిలీజ్ డేట్ లీక్.. పండగ చేసుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్..!!
ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలతో టీజర్‌ను రెడీ చేసినట్టు సమాచారం. ఈ టీజర్ ఓ రేంజ్లో ఉన్నట్టు సమాచారం..ఇక తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో మిగతా భాషల్లో రిలీజ్ అయ్యే సినిమాల రిలీజ్ లు చూసుకుని ఈ డేట్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది.మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూలై 30న 'రాధేశ్యామ్' విడుదలవుతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. 'రాధేశ్యామ్' చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. వారు 22 కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్న వార్త. ఈ కరోనా టైమ్ లో ఇది అది పెద్ద విషయం. ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమాకు అలాగే జరిగిందని తెలుస్తోంది..!!