పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

shami
అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న క్రేజీ మూవీ పుష్ప. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫారెస్ట్ ఫ్లాష్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు. అయితే సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా ఈ సినిమాలో అల్లు అర్జున్ ని నెక్స్ట్ లెవల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్.
ఈ క్రమంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తుంది. సినిమా రేంజ్ పెంచేలా ఈ సీన్స్ ఉంటాయట. అంతేకాదు సినిమాలో ఈ ఎంట్రీ సీన్ అదిరిపోతుందని అంటున్నారు. మారేడుమిల్లిలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని తెలుస్తుంది. మారేడుమిల్లి ఫారెస్ట్ లోనే అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. తప్పకుండా అల్లు అర్జున్ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన పాగా వేస్తాడని అంటున్నారు.
ఆర్య, ఆర్య 2 సినిమాలతో అల్లు అర్జున్ లోని నటుడిని ప్రేక్షకులకు పరిచ్యం చేసి సత్తా చాటిన సుకుమార్ ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ రేంజ్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే పుష్ప సినిమాను ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చేస్తున్నారని తెలుస్తుంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: