తన బాడీ గురించి సంచలన కామెంట్స్ చేసిన ప్రియాంక చోప్రా..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మిస్ వరల్డ్ గా అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం  బాలీవుడ్  లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ఆ తరువాత హాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని అక్కడ కూడా నటించి ఆకట్టుకుంది.సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు. కొన్నాళ్లకు హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం కొన్ని ఇండియన్ ప్రాజెక్ట్ లు చేస్తూనే.. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ తన ఆత్మకథను విడుదల చేస్తోంది. ‘Unfinished’ అనే పేరుతో తన ఆటోబయోగ్రఫీను త్వరలోనే మార్కెట్ లో విడుదల చేయబోతుంది.


హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో  తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకుంది. తన ఫిజికల్ అప్పియరెన్స్ మీదనే కెరీర్ ఆధారపడి ఉందని.. కానీ మొదలుకాకుండానే ముగిసిపోయిందనిపించిందని.. స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెరుచుకొని తన మొహం మీదే మూసేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అలాంటి చేదు అనుభవాలు మొదట్లో ఎదురయ్యాయని.. ఎంతో బాధపడ్డానని తన అనుభవాల గురించి రాసుకొచ్చింది.

అలానే కెరీర్ ఆరంభంలో ఓ సినిమా ఆఫీస్ కి వెళ్లగాతన బాడీని చూసి వక్షోజాలు చిన్నగా కనిపిస్తున్నాయని.. అలానే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయని.. సర్జరీ చేయించుకోమని చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. అందగత్తెగా గెలిచి వచ్చిన తనను సర్జరీ చేయించుకోమని చెప్పడంతో కుంగిపోయానని తను ఎదుర్కొన్న అనుభవాలని ఆత్మకథలో చెప్పటం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: