సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

shami
సూపర్ స్టార్ మహేష్ బాబు అఫీషియల్ టీం ట్విట్టర్ అప్డేట్స్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ లుక్ రివీల్ అయ్యింది. సూపర్ స్టార్ స్వాగ్ అంటూ మహేష్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో సూపర్ స్టార్ లుక్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు. సర్కారు వారి పాట లో కూడా ఇదే లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. 15 ఏళ్ల క్రితం రిలీజైన అతిధి, పోకిరి సినిమాల్లో లానే మహేష్ ఈ లుక్ ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో అందగాడు అంటే మహేష్ బాబు పేరే వినిపిస్తుంది.
సర్కరు వారి పాట లో కూడా మహేష్ మరోసారి తన మాస్ లుక్ తో అభిమానులను అలరిస్తాడని తెలుస్తుంది. పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా పొలిటికల్ సెటైర్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, డైలాగ్స్ ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతుంది.
మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రియులను అలరించేలా ఉంటుందని అంటున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.      
                                   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: