పాన్ ఇండియా మూవీలతో చెక్ పడబోతున్న జగపతిబాబు కెరియర్ !

Seetha Sailaja
ఫ్యామిలీ ప్రేక్షకుల హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు ఆతరువాత తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితులలో ‘లెజెండ్’ మూవీ జగపతి బాబు కెరియర్ కు ఊహించని బ్రేక్ ఇచ్చి బిజీ విలన్ గా మార్చింది. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా దక్షిణాది సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగే స్థాయికి జగపతి బాబు విలన్ కెరియర్ చేరుకుంది.  

యాక్షన్ విలనీ ఎమోషన్ పండించడానికి అవసరమైన కళ్లు జగపతి  బాబుకు ఉన్నాయని అందరు భావించడంతో కోట్ల రూపాయల  పారితోషికం తీసుకునే స్థాయిలో జగపతి బాబు కెరియర్ కొనసాగుతోంది. జగపతిబాబు ఇటు ఫ్యాక్షన్ విలనిజాన్నీ అటు కార్పొరేట్ స్థాయి విలనిజాన్ని అద్భుతంగా పండించగలడు అనే విషయాన్ని ‘నాన్నకు ప్రేమతో’ ‘అరవింద సమేత’ సినిమాలు నిరూపించాయి.  

ప్రస్తుతం జగపతిబాబు చేతిలో మంచి సినిమాలే ఉన్నప్పటికీ ఇక రానురాను అతడికి అవకాశాలు తగ్గే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరగడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా అత్యంత  భారీతనాన్ని సంతరించుకుని పాన్ ఇండియా పేరుతో పరుగులు తీస్తోంది.

మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేయడానికే మొగ్గు చూపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి భారీ సినిమాలలో విలన్ పాత్రకు జగపతి బాబును తీసుకోవడానికి టాప్ దర్శకులు ఆశక్తి కనపరచడం లేదు అని టాక్. దీనికి కారణం జగపతి బాబుకు నేషనల్ స్థాయిలో ఇమేజ్ లేదు. అందువల్ల పాన్ ఇండియా మూవీలలో విలన్ పాత్రకు బాలీవుడ్ హీరోలను విలన్ గా మార్చి ప్రయోగాలు చేస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో జగపతి బాబుకు అవకాశాలు తగ్గే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్తితులలోజగాపతి బాబు తన రూట్ మార్చి పాన్ ఇండియా ఇమేజ్ కోసం జీసస్ గా ప్రస్తుతం నటిస్తున్న మూవీ సక్సస్ అయితే జగపతి బాబుకు కూడ పాన్ ఇండియా స్టార్ అయ్యే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: