పుష్పాకి అంత రాబట్టే సీన్ ఉందా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.మొన్నటి దాకా ఈ సినిమాని ఐదుభాషల్లో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ, ఇప్పుడు ఏకంగా పది భాషల్లో సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసంట్ గా రంపచోడవరంలో షూటింగ్ ని ఫినిష్ చేస్కున్న చిత్రయూనిట్ అక్కడ తీసిన రష్ పై ఎంతో ఖుషీగా ఉన్నారు. అంతేకాదు, అల్లు అర్జున్ మాస్ లుక్ అనేది ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈసినిమాపై భారీ ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ముఖ్యంగా వేరే భాషల నుంచి అల్లు అర్జున్ సినిమాని కొనేందుకు చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారని, ముందుగే అడ్వాన్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు.

ఆగష్ట్ 13వ తేదిన సినిమాని రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేయడం అనేది మార్కెట్ ని పెంచేస్తోంది.ఇప్పుడు అన్ని భాషల్లో కలుపుకుని పుష్ప ఎంత ప్రీరిలీజ్ మార్కెట్ ని కలక్ట్ చేయబోతోందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో దాదాపుగా 500కోట్ల మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఒక్క హిందీలోనే ఈసినిమాని 100కోట్ల మార్కెట్ చేయాలని చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా 150కోట్లకి పైగానే మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు అలాగే వేరే భాషల్లో బిజినెస్ కలుపుకుని మరో 250కోట్లు బిజినెస్ చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినపిస్తోంది.

ఈ లెక్కన పుష్ప చాలా ఈజీగా రిలీజ్ టైమ్ కి 500కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుందా అని అంచనాలు వేస్తున్నారు.ఒకవేళ అంత బిజినెస్ చేసిన కాని అంత వసూళ్లు రాబట్టే సీన్ ఉందా అని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: