నరాలు తేలేట్టు జిమ్ చేస్తోన్న రకుల్ ప్రీత్.. అసలు కారణం ఏంటంటే..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక వెంకట్రాది ఎక్సప్రెస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ భామ. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిలా రాణిస్తుంది.

ఇక తెలుగు ఇండస్ట్రీలో జిమ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పుడూ జిమ్‌లో చెమటలు కక్కుతూనే ఉంటుంది ఈమె. సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా తన జిమ్ టైమింగ్ మాత్రం అస్సలు మార్చుకోదు ఈమె. ఓ వైపు జిమ్.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది రకుల్. ఈ రోజుల్లో హీరోయిన్లు చాలా తెలివి మీరిపోయారు. దీపం ఉన్నపుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. క్రేజ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఆ నాలుగు రాళ్లు కూడా రాని సమయంలో వచ్చిన రాళ్లను తమ భవిష్యత్ కోసం వాడుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రకుల్ బిజినెస్ మొదలు పెట్టింది.

ఇక ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్‌ తెలుగులో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణంగా ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. అది అలా ఉంటే సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కాగా తాజాగా  తాజాగా వర్కౌట్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. అసలే సన్నగా ఉన్న రకుల్ ఇంకాస్తా సన్నగా మారాడానికి కారణం ఏంటనీ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక రకుల్ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె నితిన్ చెక్‌లో, వైష్ణవ్ తేజ్ కొండపొలంలో నటిస్తోంది. వీటితో పాటు ఓ రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: