ఉన్నదంతా విప్పి చూపించినా.. పట్టించుకోరెందుకు..?

NAGARJUNA NAKKA
హీరోయిన్లు బోల్డ్‌గా కనిపిస్తే ఫుల్‌ బిజీగా ఉంటారనే టాక్ ఉంది. డైరీ నిండా సినిమాలు, చేతినిండా డబ్బుతో ఒక రేంజ్‌కి వెళ్తారని చెబుతారు. కానీ బోల్డ్‌ బ్యూటీ పాయల్‌రాజ్‌పుత్‌కి మాత్రం సినిమాలే రావడం లేదు. ఎంత స్కిన్‌షో చేసినా కెరీర్ మాత్రం మారడం లేదు. అంటే పాయల్‌ ఇంక లగేజ్‌ సర్దుకోవాల్సిన టైమ్ వచ్చేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

పాయల్‌రాజ్‌పుత్ ఫస్ట్‌ మూవీతోనే బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది. 'ఆర్.ఎక్స్.100' సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌తో వెండితెరకే వేడిపుట్టించింది. డెబ్యూ మూవీతోనే సూపర్ హాట్ హీరోయిన్ ఇమేజ్‌ తెచ్చుకున్న పాయల్‌కి ఇప్పుడు తెలుగులో సరైన అవకాశాలే రావడం లేదు. సోషల్‌ మీడియాలో ఎన్ని గ్లామర్ ఫోటోలు పెట్టినా కెరీర్‌ మాత్రం మారడం లేదు.

పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌ బిగినింగ్‌లోనే సీనియర్స్‌తో స్టెప్పులేసింది. 'వెంకీమామ'లో వెంకటేశ్‌తో జోడీ కట్టింది. ఇక సీనియర్‌ హీరోతో కలిసి నటించిందని, పాయల్‌ని అంతా సీనియర్ హీరోయిన్ కేటగిరీలో చేర్చారు. కుర్రహీరోలు ఎవరూ ఈమెతో సినిమా చేసేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.  

పాయల్‌ రాజ్‌పుత్‌ని హీరోయిన్‌గా తీసుకోవడానికి స్టార్ హీరోలు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. బోల్డ్‌ ఇమేజ్ ఉన్న పాయల్‌ని తీసుకుంటే ఇమేజ్‌ బ్రేక్‌ అవుతుందేమో అని భయపడుతున్నారట. దీంతో పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌కి బ్రేకులు పడుతున్నాయి. మరి ఈ సిట్యువేషన్‌ని పాయల్‌ ఎలా హ్యాండిల్ చేస్తుంది, మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

మొత్తానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ కెరీర్ కు బ్రేకులు పడ్డాయనే టాక్ సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడమే అందుకు నిదర్శనంగా తెలుస్తోంది. జనాలకు గ్లామర్ ట్రీట్ మెంట్ ఇచ్చినా ఆమె గ్రాఫ్ మాత్రం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఆమె ఎంత అందాలు ఆరబోసినా.. పాయల్ ను మాత్రం ఒక బోల్డ్ హీరోయిన్ లా చూస్తున్నారు జనాలు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: