ప్రభాస్ తో అలాంటి కథ.. అదిరిపోవాలంతే..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి సినిమా అప్పటి వరకు తన రికార్డులన్ని బద్దలు కొట్టి హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా సూపర్ హిట్ అందుకుంది. అప్పటివరకు రైటర్ గా ఉన్న కొరటాల శివ డైరక్టర్ గా మొదట చేసిన ప్రయత్నమే మిర్చి. కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు అనే డైలాగ్ బాగా పేలింది. అలా కత్తి డైలాగ్ చెప్పాడో లేదో బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి అర్ధమయ్యేలా చేశాడు.

బాహుబలి ముందు వరకు ప్రభాస్ తెలుగు హీరో మాత్రమే ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ అంటే నేషనల్ స్టార్. అందుకే బాహుబలి తర్వాత సాహో పాన్ ఇండియా రిలీజ్ కాగా.. రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ ఇవన్ని అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. మహానటి ఫేం నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ప్రభాస్, కొరటాల శివ కాంబో వస్తుందని తెలుస్తుంది.

మిర్చితో ప్రభాస్ కు సూపర్ హిట్ అందించిన కొరటాల శివ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడట. చూస్తుంటే ఈ సినిమా కూడా ప్రభాస్ రేంజ్ మరింత పెంచేలా భారీ మూవీగా వస్తుందని అంటున్నారు. సాధారణంగా తన సినిమాల్లో సమాజిక అంశాన్ని తీసుకునే కొరటాల శివ నేషనల్ వైడ్ గా ప్రభాస్ తో చేసే సినిమాకు ఎలాంటి కథతో వస్తాడో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్నాడు.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: