3 రోజుల‌కే ఉప్పెన బాక్సాఫీస్‌ను వ‌సూళ్ల‌తో ముంచేసిందిగా... థియేట‌ర్లు హౌస్ ఫుల్‌

VUYYURU SUBHASH
మెగా మేన‌ళ్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన తొలి ఆట‌కే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా వ‌సూళ్ల‌లో ఉప్పెన చూపిస్తూ బాక్సాఫీస్‌ను క‌లెక్ష‌న్ల‌తో ముంచేస్తోంది. తొలి రోజే టాక్‌తో సంబంధం లేకుండా  9 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. ఇక రెండు రోజుల‌కు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.

కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 2 రోజుల్లో 16 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఇక మూడు రోజుల‌కే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట‌లోకి వ‌చ్చేసింది. ఇక ఉప్పెనకు మరో సినిమా నుంచి పోటీ లేకపోవడంతో.. వీక్ డేస్ లో కూడా వసూళ్లు భారీగా వచ్చే సూచనలున్నాయి. ఇక డెబ్యూ హీరోల ప‌రంగా తొలి రోజు వ‌సూళ్లు ఇప్ప‌టి వ‌ర‌కు అక్కినేని హీరో అఖిల్ న‌టించిన అఖిల్‌కు ఉండేవి.

ఇప్పుడు ఉప్పెన ఆ వ‌సూళ్ల‌ను తొలి రోజు బీట్ చేయ‌డంతో పాటు రెండో రోజు కూడా తొలి రోజుకు దాదాపు స‌మాన‌మైన వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టింది. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా ఉప్పెన అంటూ ట్రేడ్ వ‌ర్గాలు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. నైజాం, వైజాగ్‌, సీడెడ్ ఎక్క‌డా తేడా లేకుండా భారీ వ‌సూళ్ల‌తో ఉప్పెన దూసుకు పోతోంది.  ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఉప్పెన ఫైన‌ల్ ర‌న్ లో రు. 45 కోట్ల పై చిలుకు షేర్ కొల్ల‌గొట్ట‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: