రాజమండ్రిలో అవి అమ్ముకునే కమెడియన్ ఆలీ ని నటుడ్ని చేసింది ఎవరో తెలుసా..??
రోడ్డు పక్కన లుంగీలు, లంగాలు, గౌన్స్ అమ్ముతున్న పిల్లవాడి దగ్గరకు వచ్చి ఇవి ఎలా అమ్ముతావ్ అన్నారు..దానికి వెటకారంగా సమాధానం ఇవ్వడంతో పక్కనే ఆ పిల్లవాడి తండ్రి వచ్చి ఆయన్ని క్షమించాలని అన్నారు. దాంతో లేదు ఈ కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడని.. తనను ఏమీ అనలేదని నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఆ కుర్రాడే స్టార్ కమెడియన్ అలీ.ఆ తర్వాత ఆర్కెస్టా నడిపే మోహన్ మిత్ర, అలీని తన వెంట తీసుకు వెళ్లి నీకేం వచ్చురా అబ్బాయ్ అని అడిగాడు. షోలే సినిమాలో డైలాగ్స్ చెప్పాడు, అలాగే మోహన్ మిత్ర షోలే సినిమాలో సాంగ్స్ పాడితే వాటికి సినిమాలో ఉండే సేమ్ స్టెప్పులు వేశాడు. ఎన్టీఆర్,నాగేశ్వరరావు లాంటి పెద్దవాళ్ళ మిమిక్రీ కూడా చేశాడు.
తర్వాత అలీని తన వెంట ఆర్కెస్టాకు తీసుకు వెళ్లి కామెడీ డైలాగ్స్, డ్యాన్సులు వేయించాడు.ఇదే సమయంలో మోహన్ మిత్రా ని కలిసిన విశ్వనాథ్ తనకు ఒక పిల్లవాడు కావాలి అని అడగడంతో ఆయన అలీ ని పరిచయం చేశాడు.అప్పుడు డాన్సులు మిమిక్రీ లతో విశ్వనాధ్ గారిని ఇంప్రెస్ చేశాడు. దాంతో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత భారతీ రాజా తీసిన సీతాకోకచిలుకలు ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అప్పటి నుంచి అలీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు..ఇప్పుడు ఇండ్రస్టీ లో అగ్ర కమెడియన్ గా, నటుడిగా కొనసాగుతున్నాడు..!!