ఉప్పెన ఈ రేంజ్ హిట్.. ముందు ఊహించి ఆయనే..!

shami
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. మొదటి సినిమా హీరో వసూళ్లు ఎలా ఉంటాయో అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా మూడు రోజుల్లోనే ఈ సినిమా సూపర్ లాభాలు తెచ్చేసింది. ఈ సినిమా సుకుమార్ సిశ్యుడు బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు.

సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. ఈ సినిమాలో అమ్మడి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని మొదట ఊహించింది మాత్రం డైరక్టర్ బుచ్చి బాబు గురువు సుకుమార్. మొదటి నుండి ఉప్పెన మీద సుకుమార్ నమ్మకం బలంగా ఉందట. కొత్త డైరక్టర్.. కొత్త హీరో.. కొత్త హీరోయిన్.. అయినా సరే ఇంత భారీ బడ్జెట్ పెడితే రిస్క్ అని తెలిసినా సుకుమార్ మీద నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ తీసుకుని ఈ సినిమా నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ నమ్మకమే నిలబెట్టింది.

ఆ సినిమాకు ఆ బడ్జెట్ పెడితేనే సూపర్ అనేలా సినిమా చూసిన వారు అంటున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతిని సినిమాకు హైలెట్ చేస్తూ సూపర్ గా వాడుకున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మొత్తంగా సుకుమార్ చెప్పినట్టుగానే ఉప్పెన ఓ రేంజ్ హిట్ బొమ్మ అయ్యింది. సుకుమార్ ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అన్నాడు. దాదాపు వసూళ్ల దూకుడు చూస్తుంటే ఉప్పెన నిజంగానే 100 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది. మొత్తానికి సుకుమార్ మాట నిజమైనందుకు మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ.                        

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: