'పుష్ప' సినిమా కోసం సుకుమార్ సంచలన నిర్ణయం.. షాక్ లో నిర్మాతలు..??
అందుకే అప్పట్లో థాయ్ లాండ్ అడవులకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు కానీ కుదర్లేదు. కరోనాతో ఏ అడవులు సేఫ్ కాదనుకున్నాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల్లో ఉన్న అడవుల్లోనే షూటింగ్ కొంతవరకు చేసారు మేకర్స్. కానీ అప్పుడు కరోనా వచ్చి యూనిట్ లో ఒకరు చనిపోవడంతో మళ్లీ వెనక్కి తగ్గాడు సుకుమార్. ఇప్పుడు ఈ సినిమా విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు లెక్కల మాస్టారు. ఇప్పటి పరిస్థితుల్లో లేనిపోని రిస్కులు తీసుకోవడం మంచిది కాదని ఆయన నిర్ణయించుకున్నాడు.అందుకే ఇకపై ఔట్ డోర్ వద్దని యూనిట్ కు చెప్పినట్లు తెలుస్తుంది.
ఈ అడవుల సెట్ ఏదో హైదరాబాద్ లోనే వేద్దామని నిర్మాతలకు కూడా సుకుమార్ నచ్చజెప్పినట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా దీనికి ఓకే చెప్పడంతో హైదరాబాద్ లోనే పుష్ప కోసం ప్రత్యేకంగా ఓ సెట్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతీసారి అడవుల్లో షూటింగ్ అంటే అనుకున్న దానికంటే షూట్ ఆలస్యం అవుతున్నందుకే సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది..ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు బన్నీ...!!