ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసేందుకు నాగ చైతన్య సై..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య గురించి తెలియని వారంటూ ఉండరు. జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ఏమాయ చేసావే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 100%లవ్’తో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, తడాఖా’ వంటి సినిమాల్లో తనలోని మాస్ యాంగిల్ చూపించాడు నాగచైతన్య.

ప్రస్తుతం అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య త్వరలో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫిదా కుర్రది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇక ఇదిలా ఉంటే త్వరలో ఈ యంగ్ హీరో డిజిటల్ స్క్రీన్ వైపు అడుగులు వేయనున్నాడని గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది తారలు డిజిటల్ లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో నాగచైతన్య కూడా ఓటీటీ వైపు చూస్తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ కొత్త విషయాలను ట్రై చేస్తుంటాను. కానీ సినీ ఫీల్డ్ లో ఓ ఫార్మాట్ ఫాలో అవుతున్నాం కాబట్టి నా మనసులో విషయాలను బయట పెట్టలేకపోతున్నాను. నాకు డిజిటల్ స్క్రీన్ పైన ఇంటరెస్ట్ ఉంది. ఖచ్చితంగా ఓటీటీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మరి త్వరలోనే ఈ అక్కినేని హీరో ఓటీటీతో పలకరిస్తాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: