యాక్టర్ ప్రసాద్ బాబు కొడుకు, కోడలు గురించి బయటపడ్డ నిజాలు..!

Divya

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు మార్పులు సంభవిస్తూ ఉంటాయి. మొదట హీరోగా అడుగుపెట్టి, ఆ తర్వాత అవకాశాలు లేక  సైడ్ యాక్టర్ గా పని చేస్తే, మరి కొంతమంది  సైడ్ యాక్టర్ గా జీవితం మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోలుగా ఎదిగిపోయిన సందర్భాలు ఇలా ఎన్నో వున్నాయి. అంతేకాదు ప్రస్తుతం మెగాస్టార్ అనిపించుకుంటున్న చిరంజీవి కూడా మొదట సైడ్ యాక్టర్ గా చేస్తూనే, ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగిపోయాడు.

ఇక చిరంజీవి మెగాస్టార్ రూమ్ మేట్ అయిన ప్రసాద్ బాబు అడపాదడపా సినిమాలు చేస్తూ, బుల్లితెరపై వచ్చే ధారావాహికలలో చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ప్రసాద్ బాబు కొడుకు, కోడలు విషయానికొస్తే.. వారు కూడా బుల్లితెరపై సీరియల్స్ లలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రసాద్ బాబు కొడుకు శ్రీకర్. శ్రీకర్  ని మనం చాలా సందర్భాలలో, ఎన్నో సీరియల్స్ లలో చూసి ఉంటాము. ఇప్పుడు శ్రీకర్ కూడా చాలా సీరియల్స్ లలో నటిస్తూ, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.

 
ప్రసాద్ బాబు కోడలు కూడా మనందరికీ తెలిసిన అమ్మాయే. ఈమె ఎవరో కాదు సంతోషిని. సంతోషిని డైరెక్టర్ తేజ తీసిన జై సినిమాలో నవదీప్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో కూడా శ్రీహరి కి జోడీగా నటించి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అమ్మాయి. అయితే కొద్ది సంవత్సరాల క్రితం సంతోషిని, శ్రీకర్ ని పెళ్లి చేసుకొని, లైఫ్ లో సెటిల్ అయిపోయింది.


ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వచ్చి,తొలుత సినిమాలలో నటించి, ప్రేక్షకులను మెప్పించారు. తరువాత పెళ్లిళ్లు చేసుకొని వారి లైఫ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం వీరు కూడా సినిమాలలో, సీరియల్స్ లలో  పనిచేస్తూ, వారికంటూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టుకున్నారు. ఇలా ఉండగా ప్రసాద్ బాబు అప్పుడప్పుడు చిరంజీవితో కలిసి మాట్లాడుకుంటారని, చిరంజీవి అంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, తమను మర్చిపోలేదని ప్రసాద్ బాబు ఎప్పుడూ చెప్తుంటాడు. అంతేకాకుండా వారు చెన్నైలో ఉన్నప్పుడు,వారు ఇబ్బంది పడిన సంఘటనలను చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటారని కూడా ప్రసాద్ బాబు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: