ఎన్.టి.ఆర్ తోనే ఉప్పెన బుచ్చి బాబు.. బ్యాక్ డ్రాప్ కథ రెడీ..!
ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరక్టర్ మైత్రి మూవీ మేకర్స్ తోనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తాడని టాక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో 80ల కాలం నాటి కథతో వస్తున్నాడట బుచ్చి బాబు. ఈ సినిమాకు కూడా వైజాగ్ బ్యాక్ డ్రాప్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తారక్ తో బుచ్చి బాబు సినిమా అనగానే సిన్మాపై అంచనాలు పెరిగాయి. నిజంగా అదే జరిగితే ఇక మాములు రచ్చ కాదు.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చి బాబు సినిమా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా బిగ్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. సెకండ్ సినిమానే కాదు బుచ్చి బాబు థర్డ్ మూవీ కూడా మైత్రి మేకర్స్ బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది.