నితిన్ జోరు మాములుగా లేదు.. అందాదున్ రీమేక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

shami
యువ హీరో నితిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరో వారంలో చెక్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్ ఈ సినిమాను చంద్రశేఖర్ యేలేటి డైరెక్ట్ చేశారు. సినిమాలో నితిన్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా తర్వాత వెంకా అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మార్చ్ 26న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ సినిమాల తర్వాత అందాదున్ రీమేక్ ను కూడా రిలీజ్ లైన్ లో పెట్టాడు నితిన్. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో నభా నటేష్, తమన్నా ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అక్కడ టబు చేసిన పాత్రలో ఇక్కడ తమన్నా చేస్తుంది. ఈ సినిమాతో తమన్నా మళ్లీ సూపర్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.

ఫిబ్రవరి, మార్చ్ రెండు నెలల్లో రెండు సినిమాల రిలీజ్ లు పెట్టుకున్న నితిన్ అందాదున్ రీమేక్ ను కూడా జూన్ 11న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది. నితిన్ అందాదున్ రీమేక్ మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు. జూన్ 19న అఖిల్ బ్యాచ్ లర్ సినిమా రాబోతుంది. దానికి వారం ముందు నితిన్ అందాదున్ రీమేక్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో టీజర్ త్వరలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి నితిన్ చేస్తున్న ఈ మూడు సినిమాల్లో ఏది వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. నితిన్ మాత్రం ఈ మూడు సినిమాల మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.                              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: