రానా నటించిన 'లీడర్' సినిమాను రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు స్టార్ హీరోలు..ఎవరో తెలుసా..??
ఇందులో ఉన్న చాలా డైలాగులను వారు నెమరు వేసుకుంటూనే ఉన్నారు. రానా నటన కూడా సూపర్. మొదటి చిత్రం చేస్తున్నాడు అనే ఫీలింగ్ ను ప్రేక్షకుడికి కలగకుండా అతను అత్యద్భుతంగా నటించాడు. ఇదిలా ఉండగా.. 'లీడర్' చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ రానా కాదట. ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే రానా వద్దకు వచ్చిందట. వివరాల్లోకి వెళితే మొదట ఈ చిత్రం కథను దర్శకుడు శేఖర్ కమ్ముల.. అల్లు అర్జున్ కు వినిపించాడట. ఆ టైంలో అతను 'ఆర్య2' 'వరుడు' 'వేదం' వంటి 3 ప్రాజెక్టులకు కమిట్ అవ్వడంతో కథ నచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టు చెయ్యలేను అని చెప్పాడట.దాంతో రాంచరణ్ వద్దకు ఈ స్క్రిప్ట్ ను తీసుకెళ్లాడట దర్శకుడు.
అయితే చరణ్ అప్పటికే 'ఆరెంజ్' చిత్రానికి కమిట్ అయ్యాడు. అది కూడా ఎక్కువ రోజులు విదేశాల్లోనే గడపాల్సి ఉంది. దాంతో అతను నొ చెప్పడమే కాకుండా.. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రానాతో ఈ ప్రాజెక్టు చేస్తే బాగుంటుంది అని శేఖర్ కమ్ములకి చెప్పాడట. అలా అది నిర్మాత సురేష్ బాబు వద్దకు వెళ్లడం జరిగింది. అయితే ఎంట్రీ ఓ మాస్ మూవీతో చేస్తే బాగుంటుంది అని దివంగత రామానాయుడు గారు సురేష్ బాబుకి చెప్పారట. కానీ రానా మాత్రం 'లీడర్' మూవీతోనే ఎంట్రీ ఇస్తాను అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిందట..!!