విజయ్ దేవరకొండ.. సుకుమార్.. షాక్ ఇస్తున్న అప్డేట్..!

shami
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, సుకుమార్ ఎవరు ఊహించని ఈ కాంబోతో షాక్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ఓ అప్డేట్ రొడీ ఫ్యాన్స్ ను నిరాశపరచింది. సుకుమార్ పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రేయిబవళ్లు కష్టపడుతున్న సుక్కు పుష్ప తర్వాత కనీసం ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.

పుష్ప సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకు సుకుమార్ ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు లైన్ మాత్రమే ఓకే చేయగా ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ కోసం కొంత టైం తీసుకుంటారట. అంతేకాదు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంచనాలను మించి సినిమా ఉండేలా చూస్తున్నారట. తప్పకుండా పుష్పతో సుక్కు తన స్టామినా చూపించి విజయ్ దేవరకొండ సినిమాతో అదిరిపోయే హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. విజయ్ కూడా సుకుమార్ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు.                              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: