పొగరు రెండ్రోజుల వసూళ్లు...!!!

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ప్రముఖ కన్నడ హీరో తెలుగు తమిళ భాషల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా హీరోగా నటించిన సినిమా "పొగరు"..నంద కిషోర్ దర్శకత్వం వహించాడు.. డి.ప్రతాప్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతంలో రూపొందిన 'కరాబు మైండు కరాబు' అనే ఒక్క పాట..యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి ఒక రేంజిలో వ్యూస్ రాబట్టింది. ఇక ఈ పాట ఒక రేంజిలో  హిట్ అవ్వడంతో జనాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ పాట ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం వాటిని ఏమీ మ్యాచ్ చెయ్యలేకపోయిందనే చెప్పాలి.అంచనాలని ఏమాత్రం అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడింది..కానీ రష్మిక వంటి స్టార్ హీరోయిన్ ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం కాస్తో కూస్తో మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది.రష్మిక మందన కి వున్న క్రేజ్ వల్ల జనాలు ఈ సినిమాని చూస్తున్నారు...

ఇక ఈ సినిమా రెండ్రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే....'పొగరు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 1.27 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.93 కోట్ల షేర్ ను రాబట్టాలి. నెగిటివ్ టాక్ రావడం వల్ల మొదటిరోజు కంటే రెండో కలెక్షన్లు తగ్గాయని స్పష్టమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్, ఇంకా ఏ సినిమా ఎంత వసూళ్లు రాబాట్టిందో తెలుసుకునేందుకు ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: