బాహుబలి ని ఉప్పెన ఢీ కొట్టగలదా..!
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇందులో నటించిన నటీనటులు స్థానాన్ని సుస్థిరం చేసింది. అగ్ర దర్శకుడు రాజమౌళి తనకు సాటి ఎవరూ లేరని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా ఈ సినిమాను తీశాడు. ఇది కేవలం థియేటర్లలోనే కాకుండా బుల్లితెరపై కూడా టీఆర్పీ రేటింగ్ బాగా సాధించిపెట్టింది. ప్రస్తుతం ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ సాధిస్తోంది కూడా.. బాహుబలి సినిమా ద్వారా దర్శక నిర్మాతలు భారీ మూల్యాన్ని తమ అకౌంట్లో వేసుకున్నారు. అంతేకాదు హీరో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగి, ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పైనే మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే..
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో విడుదలయ్యి యూత్ లో భారీ అంచనాలు నెలకొని, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధించిన సినిమాలలో ఉప్పెన సినిమా కూడా ఒకటి. హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ, తెరకెక్కిన ఈ సినిమా విడుదల అవ్వక ముందు ఈ సినిమా హైప్ పెరగడానికి కారణం దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పవచ్చు.ఈ సినిమాలో ఆయన ఇచ్చిన సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పవచ్చు.
అయితే ఈ చిత్రం విడుదల అయిన మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను అందుకోవడం విశేషం. ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్య పోతున్నారు. ఈ సినిమా మొదటి రోజూ ఏకంగా 9 కోట్ల 50 లక్షల రూపాయలను వసూల్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. అందులో ఒక కొత్త హీరో అంటే అది చరిత్ర రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు 7 కోట్ల 30 లక్షల రూపాయలు, మూడవ రోజు 8 కోట్ల 50 లక్షల రూపాయలను కలెక్ట్ చేసి, ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రాలలో నెంబర్ వన్ గా నిలిచింది.
ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఇలాంటి కలెక్షన్లు రావడం లేదు. అక్కడ థియేటర్ లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడం గమనార్హం. అయితే మొదటివారంలోనే దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మీడియం సైజు చిత్రాలలో చరిత్ర రికార్డు సృష్టించింది.