'క్రాక్' హిట్ తో ట్రాక్ లోకి రవితేజ.. రెమ్యునరేషన్ ఎంత పెంచేసాడో తెలుసా..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం మాస్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రవితేజ. అదిరిపోయే మాస్ యాక్షన్ చేయడంలోనూ.. ఆకట్టుకునే కామెడీ చేసి అందరినీ కడుపుబ్బ నవ్వించడంలోనూ  మాస్ మహారాజా రవితేజ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఇక పోతే ఎన్నో రోజుల నుంచి విభిన్నమైన కథాంశంతో తెరమీదకి వచ్చినప్పటికీ సరైన విజయం సాధించలేక సతమతమై పోయాడు రవితేజ.

 కానీ చాలా రోజుల తర్వాత ఇటీవలే క్రాక్ సినిమాతో తన ఖాతాలో మంచి విజయాన్ని నమోదు చేశారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.  ఈ సినిమాలో చాన్నాళ్ల తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడం సినిమాకి చాలా ప్లస్ అయింది .  అయితే సాధారణంగా ఫ్లాప్ వస్తున్నప్పుడు ఎలా రెమ్యునరేషన్ తగ్గించుకుంటారో.. హిట్ వచ్చినప్పుడు అలాగే హీరోలు రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఉంటారు . క్రాక్ తో  మంచి విజయం అందుకున్న రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు  టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే క్రాక్  సినిమా విజయం తో జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇక వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే త్రినాధరావు నక్కి తో తన 68వ సినిమాకు ప్రకటించిన రవితేజ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడట. ఏకంగా 16 కోట్ల వరకు డిమాండ్ చేశాడట . రవితేజ కోరిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ కూడా సిద్ధమైనట్లు  టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో దర్శకుడు మారుతి రవితేజతో తీయాల్సిన సినిమా కాస్త గోపి చంద్ తో చూస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: