బాబీ తర్వాత ఆ ఫేడ్ అవుట్ డైరెక్టర్ తో చిరు చిత్రం..?

P.Nishanth Kumar
మెగా స్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు కమర్షియల్ అంశాలు జోడించి సినిమా తీయడంలో కొరటాల శివ పనితనం ఏంటో అయన గత చిత్రాలు చూసి చెప్పొచ్చు. ఈ సినిమా కూడా అలాంటి సినిమాగానే తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండడం విశేషం..  ఇక ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే..
ఇటీవలే రామ్ చరణ్ లుక్ రిలీజ్ అయ్యింది.. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ పాత్ర లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఈ లుక్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు. మొన్నటివరకు మోషన్ పోస్టర్ నే రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ లుక్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ ని ఒక్కసారిగా పెంచింది.. ఇకపోతే చిరు ఏరి కోరి ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ని ఎన్నుకోవ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. మెహ‌ర్ ర‌మేష్ తో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. `వేదాళం`కి రీమేక్ అది. మెహ‌ర్ ట్రాక్ రికార్డ్ అంద‌రికీ తెలిసిందే. త‌నతో సినిమా అంటే చిరు ఫ్యాన్స్ ఝ‌డుసుకున్నారు. మెహ‌ర్ తో సినిమా ఏంటి? అని ఆశ్చర్య‌పోయారు. కానీ మెహ‌ర్ పై న‌మ్మ‌కం ఉంచాడు చిరు.
దర్శకుడు బాబీ తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఆమ‌ధ్య చిరంజీవి శ్రీ‌నువైట్ల‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదీ షాకింగ్ న్యూసే. ఎందుకంటే దూకుడు త‌ర‌వాత త‌న‌కు స‌రైన హిట్టు లేదు. ఆ సంగ‌తి అటుంచితే.. ఇప్పుడు కృష్ణ‌వంశీతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట చిరు. కృష్ణ‌వంశీ బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేసుకున్నాడు. ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అదే క‌థ‌తో చిరు సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇదే నిజమైతే... చిరు ఫ్యాన్స్‌కి అంత‌కంటే షాకింగ్ న్యూస్ ఇంకోటి ఉండ‌దు. ఎందుకంటే వ‌రుస‌గా తాను ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌ని ఎంచుకుంటున్నాడు. ఇది ఎంతో రిస్క్ కూడా. చిరుకి ద‌ర్శ‌కులు, క‌థ‌లు దొర‌క‌డం లేదా? పెద్ద ద‌ర్శ‌కులెవ‌రూ చిరుతో సినిమా చేయ‌డానికి రెడీగా లేరా? చిరు ఎందుకింత తొంద‌ర ప‌డుతున్న‌ట్టు? అనే ప్రశ్న‌లు రేకెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: