హిట్టు కోసం గట్టిగానే సిద్ధం చేసాడట ..... చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగే ఉండేలా ఉంది .....??

GVK Writings
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. రాజమౌళి దర్శకత్వంలో మరొక స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రని అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని చేస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ఇద్దరి హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి సూపర్ స్పందన సాధించి మూవీ పై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.

కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీకి సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథని అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 13 న రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నారు. 

ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించనున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ పాత్ర ఎంతో అదిరిపోనుందని టాక్. థమన్ మ్యూజిక్ అందించనున్న ఈ మూవీ మార్చి రెండవ వారంలో పట్టాలెక్కనున్నట్లు టాక్. ఇక మూవీ ని ఎట్టిపరిస్థితుల్లో పక్కాగా భారీ హిట్ చేసేలా ఇప్పటికే తన టీమ్ తో కలిసి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని ఎంతో పకడ్బందీగా తయారు చేసారని, తప్పకుండా గతంలో తామిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత ని మించేలా ఈ మూవీ ని తీయాలని త్రివిక్రమ్ సంకల్పించినట్లు చెప్తున్నారు. మొత్తంగా చూస్తుంటే తప్పకుండా అతి త్వరలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కలయికలో రానున్న సినిమా భారీ సక్సెస్ కొట్టేలా ఉందని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: