పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?
ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. మొఘలుల కాలం నాటి కథతో ఈ సినిమా సరికొత్త గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ లుక్ మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా ఉండనుంది.
అయితే ఈ సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. కాగా షార్ట్ ఫిలింస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న పూజితా పొన్నాడ ఆ పాటలో స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో చాన్స్ కొట్టేసింది పూజిత అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాక్ కూడా వినిపిస్తుండటంతో ఇది నిజమేనని సమాచారం.
ఈ చిత్రంలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ మరియు నిధి అగర్వాల్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. సరికొత్త కథతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. మరోవైపు పవన్ తాజా చిత్రం వకీల్ సాబ్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ రీఎంట్రీ తర్వాత తెరకెక్కిన మొట్ట మొదటి చిత్రంగా ఈ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అని ఫిక్స్ అయ్యారు అభిమానులు.