కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్న రాశిఖన్నా.. ఎందుకో తెలుసా..?
ఇక ఇప్పుడు ఫిట్నెస్ విషయంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు మొన్నటి వరకు ట్రెడిషనల్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన హాట్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. ఇక హాట్ హాట్ పిక్స్ తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది ఈ సొగసరి. ఇక ఇప్పుడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతుంది రాశి కన్నా. ఇకపోతే ప్రస్తుతం రాశిఖన్నా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటుంది.
రాశిఖన్నా కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి వెనుక కారణం ఏమిటి అని అంటారా.. దీని వెనుక పెద్ద కారణమే ఉందండోయ్.. షాహిద్ కపూర్ తో కలిసి రాశిఖన్నా సన్నీ అనే సినిమాలో నటిస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా కిక్ బాక్సింగ్ నేర్చుకుంటుంది రాశికన్నా. సినిమా కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల అటు తనపై తనకు నమ్మకం కూడా పెరిగిపోతుందని ఎలాంటి చాలెంజ్ అయిన సులభంగా ఎదుర్కోగలను అనే నమ్మకం తనలో పెరిగింది అంటూ రాశికన్నా చెప్పుకొచ్చింది. ఇలా ఒకప్పుడు బొద్దుగా ఉండి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మాత్రం మంచి ఫిట్నెస్ తో హాట్ పిక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.