సినిమా హీరోల మధ్య ఎలాంటి విబేధాలు ఉండవు. వారంతా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఒకవేళ విబేధాలు ఏమైనా ఉన్నా అవి భయటకు కనిపించవు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ కొట్టుకు చేస్తూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ బడాయిలకు పోతారు. మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటే మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటూ రచ్చ చేస్తుంటారు. ఇక సినిమా అప్డేట్స్ ఉన్నపుడు ట్విట్టర్ లో అయితే మాములు రచ్చ ఉండదు..మా హీరో పాన్ ఇండియా స్టార్ అని ఒకడు..మా హీరో పాన్ వరల్డ్ స్టార్ అని మరొకడు. అంతెందుకు హీరోల కోసం ఫ్యాన్స్ కొట్టుకు చచ్చిన రోజులు కూడా లేకపోలేదు. అలాంటి ఫ్యాన్స్ అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేలా బాలయ్య ఫ్యాన్స్ ఒక గొప్ప పని చేసారు. అదేంటంటే. కడపకు చెందిన సురేష్ అనే మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఒకరు అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆయన కడప జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు గా ఉన్నారు. ఆయన మెగాస్టార్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే సురేష్ ఆసుపత్రిలో చేరడంతో బాలయ్య అభిమానులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసారు. బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు పీరయ్య తిరుపతిలో సురేష్ ను కలిసి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. పీరయ్య మరికొంతమంది బాలయ్య అభిమానులతో కలిసి ఆస్పత్రి వెళ్లి సురేష్ ను పరామర్శించారు. దాంతో బాలయ్య అభిమానులు ఇప్పుఫు ఆదర్శంగా నిలుస్తున్నారు. హీరోల అభిమానులు అంటే గొడవలు పెట్టుకోవడం కాదని కలిసి మెలిసి ఉండటం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడమని రుజువు చేశారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన అభిమానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిచారు.
మరింత సమాచారం తెలుసుకోండి: