సినిమాల్లో ఎక్కువ రోజులు రానివ్వడనైకి అసలు కారణం ఇదేనంట..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ద‌క్షిణాదిన ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ల‌లో స‌మంత మొద‌టి వ‌రుస‌లో ఉంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ మాయ చేశావే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు గుర్తింపును సంపాదించుకుంది. ఇక అక్కినేని వార‌సుడు, హీరో నాగ చైత‌న్య‌ను వివాహం చేసుకున్న స‌మంత‌. ఆ త‌రువాత కూడా స,సమంత సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఆహా కోసం ఆ మ‌ధ్య‌న హోస్ట్ ‌గా కూడా మారింది సమంత.
అయితే సినిమాల్లోకి వ‌చ్చి ఇటీవ‌లే 11 సంవ‌త్స‌రాలను పూర్తి చేసుకున్న స‌మంత‌. ఇప్పుడు త‌న‌కు ప్రాధాన్యం ఉన్న స్క్రిప్ట్‌ల‌నే ఎంచుకుంటోంది. ఈ క్ర‌మంలో తెలుగులో శాకుంతలం అన్న చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మౌతున్నారు. పౌరాణిక క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఇంత‌వ‌ర‌కు క‌నిపించ‌ని పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఇండ‌స్ట్రీలో ఇన్ని సంవ‌త్స‌రాల పాటు విజ‌య‌వంతంగా కొన‌సాగడం వెనుక ఉన్న త‌న సీక్రెట్‌ని ఇటీవ‌ల రివీల్ చేశారు స‌మంత‌.
ఇక సినిమాల్లో విజ‌యవంతంగా కొన‌సాగ‌డానికి హార్డ్ వ‌ర్క్‌నే తన సీక్రెట్ అని ఆమె అన్నారు. ప్ర‌తి రోజు త‌న మొద‌టి రోజులా భావిస్తార‌ని.. కొత్త విష‌యాలు నేర్చుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతాన‌ని స‌మంత తెలిపారు. ఇక ఒక స్థానంలో మనం కంఫర్ట్‌గా కూర్చుంటే.. దాన్ని క‌చ్చితంగా కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని.. అలా కాకుండా తాను ఎప్పుడూ క‌ష్టాన్ని న‌మ్ముకున్నాన‌ని అక్కినేని కోడ‌లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇందులో స‌మంత నెగిటివ్ రోల్‌ని పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: