తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గౌరవ మర్యాదల పై జగపతిబాబు వ్యాఖ్యలు !

Seetha Sailaja
విలక్షణ నటుడు జగపతిబాబు తన మనసులోని మాటను ఎలాంటి మొహమాటాలు లేకుండా చెపుతూ ఉంటాడు. ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాల హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతిబాబు ఆతరువాత తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయి చేయడానికి సినిమాలు లేని పరిస్థితులు కూడ ఎదుర్కున్నాడు.

‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారి ఆ తరువాత టాప్ విలన్ స్థాయికి చేరుకొని కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా దక్షిణాది సినిమా రంగంలోని అనేకమంది ప్రముఖ హీరోల సినిమాలలో విలన్ పాత్రలకు జగపతి బాబు చిరునామాగా మారాడు. అయితే గత కొద్ది కాలంగా తెలుగు సినిమాలలో జగపతిబాబు విలన్ పాత్రల హవా కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తోంది.

అయినప్పటికీ జగపతిబాబు బిజీ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన హవా కొనసాగిస్తున్నాడు. ఇటీవల కన్నడ సినిమా ‘రాబర్ట్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలలో జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ‘రాబర్ట్’ మూవీని తెలుగులో డబ్ చేయడంతో ఆమూవీ మార్చి 11న విడుదల అవుతోంది. ఈమూవీలోని కీలక పాత్రలో జగపతిబాబు నటించాడు.  

'కన్నడ ఇండస్ట్రీలో నాకెంతో గౌరవం దొరికింది. అంతటి గౌరవం నాకు తెలుగులో కనిపించదు' అంటూ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో షాకింగ్ కామెంట్స్ చేసాడు. అలాగే  'నేను మాములుగా ప్రీరిలీజ్ వేడుకలకు రాను. కానీ దర్శన్ కోసం కన్నడ ఫ్యాన్స్ కోసం వచ్చాను. దర్శన్ కాళ్ళు తల ఎప్పుడు కూడా నేలమీదే ఉంటాయి. రియల్ స్టార్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనితో జగపతిబాబు చేసిన కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా చేశాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ప్రస్తుతం జగపతిబాబు కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న జగపతిబాబు కోపం ఎవరి పై అంటూ మరికొందరు ఆశ్చర్యపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: