చరణ్ తో గౌతమ్ మూవీ ఫిక్స్ .... పండుగ రోజు ప్రకటన ....??
కాగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ లెవెల్ లో ఎంతో భారీగా రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల రావడం జరిగింది. దీని తరువాత యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి ఈ వార్త చాలా రోజుల నుంచి ప్రచారం అవుతుండగా ఈ మూవీ పక్కాగా రెండు రోజల క్రితం ఫిక్స్ అయిందని అంటున్నారు.
ఈ మూవీ యొక్క స్టోరీ ని రెండు రోజుల క్రితం రామ్ చరణ్ ఓకే చేశారని మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదిరిపోతుందని అలానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కనుందని అంటున్నారు. కాగా ఈ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించనున్నట్లు టాక్. ఇక అతి త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మహఃశివరాత్రి పండుగ రోజున వస్తుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!