సాయి పల్లవి ఆధిపత్యం పై సమంతకు పెరిగిపోతున్న ఖంగారు !
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి మూడు పాటలు విడుదల అయ్యాయి. ఆ పాటలు అన్నీ హిట్ అయినప్పటికీ ఈమూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘సారంగ దరియా’ పాట ఈసంవత్సరంలోని హిట్ పాటలలో టాప్ 3 లోకి చేరుతుందని అంచనాలు వస్తున్నాయి. ఈపాటకు లక్షలలో లైక్స్ కూడ వస్తున్నాయి.
‘సారంగ దరియా’ పాట బయటకు రాగానే జనం అంతా కేవలం సాయి పల్లవి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఈసినిమాలోని హీరో నాగచైతన్య గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లవ్ స్టోరీ’ కథ అంతా సాయి పల్లవి చుట్టూ తిరుగుతుందని టాక్. దీనికితోడు ఈమూవీలోని నాగచైతన్య పాత్ర కూడ అంతంతమాత్రమే అన్న లీకులు వస్తున్నాయి.
సాధారణంగా చైతూ సినిమాల మంచి చెడ్డలు సమంత చూస్తూ ఉంటుంది. కొన్ని సినిమాల విషయంలో సమంత చొరవగా కలగచేసుకుని చైతన్య సినిమాల దర్శకులకు కొన్ని మార్పులు చేర్పులతో పాటు చైతన్య సినిమాలకు సంబంధించి కొన్ని స్పష్టమైన సూచనలు ఇస్తూ ఉండటం సమంత అలవాటు అని అంటారు. అయితే తాను తీసే సినిమాల విషయంలో శేఖర్ కమ్ముల ఎవరి మాటను పట్టించుకోడు అని టాక్. ఇప్పుడు సమంత విషయంలో కూడ ఆమె ఎంత ప్రయత్నించినా ఈమూవీ కథ విషయంలో చెప్పిన మార్పులను శేఖర్ కమ్ముల లైట్ గా తీసుకున్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. చైతన్యను టాప్ యంగ్ హీరోగా నిలబెట్టాలి అన్న ఉద్దేశ్యంతో అడుగులు వేస్తున్న సమంత ‘లవ్ స్టోరీ’ విడుదల అయ్యాకా జనం చైతూను పట్టించుకోకుండా కేవలం సాయి పల్లవిని గురించి మాత్రమే మాట్లాడితే ‘లవ్ స్టోరీ’ మూవీ వల్ల చైతన్యకు వచ్చే లాభం ఏమిటి అంటూ ప్రస్తుతం సమంత మధన పడుతున్నట్లు టాక్..