కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమా థియేటర్లు మూతపడి షూటింగ్ పూర్తిచేసుకున్నా ఎన్నో సినిమాలు విడుదల కాకుండా ఉండిపోయాయి. ఇక కరోనా లాడ్ డౌన్ ఎత్తివేసిన తరవాత జనవరిలో విడుదలైన క్రాక్, ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సినిమాల విజయంతో సినిమాలు వరుస పెట్టివిడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇక ఈ శుక్రవారం రేపు ఎకంగా డజన్ కు పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఏ1 ఎక్ప్‌ప్రెస్ సినిమా కూడా ఒకటి ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం స్పోట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. షాదీముబారక్ కూడా రేపే విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మొగలి రేఖులు సీరియల్ హీరో సాగర్ నటించగా సినిమాను దిల్ రాజు బ్యానర్ పై నిర్మించారు.
కేజీఎఫ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన యష్ నటించిన గజకేసరి సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఏకమ్ సినిమా కూడా రేపే విడుదల కాబోతంది. నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రదాన పాత్రలో నటించిన క్లైమాక్స్ సినిమా కూడా రేపే విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ప్రముక రాజకీయ నాయకుడు దేవినేని కథ ఆదారంగా తీసిన దేవినేని కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో తారకరత్న హీరోగా నటించారు. రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లే సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. సినిమాలో అవును ఫేం పూర్ణ కీలక పాత్రలో నటించింది. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హరిప్రసాద్ జక్కా తెరకెక్కించిన సినిమా ప్లేబ్యాక్ కూడా రేపే విడుదల కానుంది. ఈ సినిమాలతో పాటు..ఏకమ్, ఏ, గర్జన, తోటబావి, సర్వం సిద్దం, విజయ్ సేతుపతి విక్రమార్కుడు కూడా రేపే విడుదల కానున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: