పాజిటివ్ టాక్ తో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టిన "ఎ1 ఎక్స్ ప్రెస్"....
మార్చి 5న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ విషయానికి వస్తే....‘ఎ1 ఎక్స్ ప్రెస్’ సినిమాకి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా 0.81 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 4.19 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా సినిమాలున్నప్పటికీ ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది.ఇక గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న సందీప్ కిషన్ కి ఈసారి ఈ సారి ఈ సినిమాతో మంచి హిట్ లభించింది. చూడాలి ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి ఇక ఎంత వసూలు చేస్తుందో...