మరో సీనియర్ హీరోయిన్ పై కన్నేసిన త్రివిక్రమ్.. అంతా ఎన్టీఆర్ కోసమే..?
అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సినిమా సినిమాకి ఒక సీనియర్ హీరోయిన్ ను తీసుకొచ్చి ప్రేక్షకులందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పటికే నదియా, కుష్బూ, టబు లాంటి సీనియర్ హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీ లోకి ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ తీసుకొచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇవ్వడమే కాదు తమదైన నటనతో కూడా ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ ని టాలీవుడ్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది అర్థం అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్మధుడు సినిమా తో ప్రేక్షకులను అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అన్షు.
అప్పట్లో రెండు మూడు సినిమాలతోనే ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత మాత్రం అవకాశాలు లేకపోవడంతో తెలుగు వెండితెర పై కనుమరుగు అయిన విషయం తెలిసిందే. అయితే ఇక సినిమాలకు దూరం అయిన తర్వాత బిజినెస్మేన్ సచిన్ ను పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం తన తెలివితేటలతో ఫ్యాషన్ డిజైనర్ గా కూడ ఎంతగానో రాణిస్తుంది. ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అన్షు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లోకి వస్తుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ హీరోగా తెరకెక్కే సినిమాలు.. జూనియర్ ఎన్టీఆర్ అక్క పాత్రను పోషించబోతున్నారు అని ప్రచారం ఊపందుకుంది.