మ్యాచో స్టార్ గోపీచంద్ , మాస్ డైరెక్టర్ సంపత్ నందితో జత కట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా 'సీటీమార్'. కబడ్డీ గేమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రూపొందిస్తున్నారు. మరోవైపు హీరో గోపిచంద్ కూడా ఎలాగైన బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. గోపిచంద్ మంచి హిట్ వచ్చి చాలా రోజులు అయింది. ఆయన లాస్ట్ సూపర్ హిట్ జిల్ సినిమా. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలు అన్ని ప్లాప్స్ వచ్చాయి. అయితే ఆయన ప్లాప్స్ ఎన్ని వచ్చిన కూడా గోపిచంద్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' మూవీ చేస్తున్న హీరో గోపీచంద్ మరో సినిమాను కూడా లైన్లో పెట్టేశారు.డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా రూపొందనుంది. ఈమద్యనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ చిత్ర టైటిల్ కూడా రివీల్ చేశారు. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిన్ననే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. ఈ షూట్ ఫొటోస్ కూడా బయటకి వచ్చాయి. అయితే ఈ ఫొటోస్ లో గోపిచంద్ న్యూ లుక్ తో కనిపిస్తున్నారు. మొన్నటిదాకా గడ్డంతో ఉండే గోపిచంద్ ఈ సినిమాలో క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు.మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలా ముచ్చటగా మూడోసారి జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్, బన్నీవాసు, మారుతి కాంబినేషన్ సెట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: