సింగర్ సిద్ శ్రీరామ్ కు పబ్ లో అవమానం..!

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సింగర్ సిద్ శ్రీరామ్ కు హైదరాబాద్ లోని ఓ పబ్ లో అవమానం జరిగినట్టు తెలుస్తోంది. సిద్ శ్రీరామ్ కు బంజారాహిల్స్ లోని 10సి లో ఉన్న సన్ బర్న్ సూపర్ క్లబ్ లో చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తోంది. ఆదివారం సిద్ ఓ మ్యూజికల్ కాన్సెర్ట్ కు హాజరు కాగా ఆయనపై కొంతమంది పోకిరీలు మద్యం, నీళ్ళు విసిరినట్టు సమాచారం. ఈ ఘటన తో ఆవేశానికి గురైన సిద్ శ్రీరామ్ ఆ పోకిరీలను "గెట్ అవుట్" అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో వారి మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగగా పబ్ నిర్వాహకులు జోక్యం చేసుకుని గొడవకు ఆపిందట.  ఇక ఈ ఈవెంట్ కు పలువురు ప్రముఖ సెలబ్రెటీలు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పబ్ నిర్వాహకులు గొడవ భయటకు వెళ్లకుండా మ్యానేజ్ చేసినట్టు సమాచారం.
ఇక ఈ పబ్ లో ఈ నెల 6 నుండి 8వరకు సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సిద్ శ్రీరామ్ పాటలు మోత మొగుతున్నాయి. ఎక్కడ చూసినా ఆయన పాటలే వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠ పురంలో సినిమాలో "సామజ వరగమన" పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రదీప్ హీరోగా నటించిన "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" సినిమాలోని "నీలి నీలి ఆకాశం " సాంగ్ అయితే ఆ సినిమాకే ప్రమోషన్స్ గా మారింది. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న వకీల్ సాబ్ సినిమాలో "మగువా మగువా" పాటను కూడా సిద్ శ్రీరామ్ ఏ పాడారు. అంతే కాకుండా శశి సినిమాలో "ఒకే ఒకే లోకం", రంగ్ దే సినిమాలో "నా కనులు ఎపుడు" అనే పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: