విజయ్ దేవరకొండ క్రేజ్ కి ఇది మరో నిదర్శనం....

Purushottham Vinay
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ "పెళ్లి చూపులు" సినిమాతో  టాలీవుడ్ లో హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.ఇక అప్పటిదాకా చిన్న హీరోగా ఎదుగుతున్న విజయ్ కి "అర్జున్ రెడ్డి" సినిమాతో ఒక రేంజిలో హిట్ లభించింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో పెద్ద స్టార్ అయ్యాడు.ఎంతలా అంటే ఇండియా మొత్తం తన పాపులారిటీని విస్తరించుకున్నాడు విజయ్.అయితే ఈ మధ్య కాలంలో అతని సినిమాలు పెద్దగా ఆడలేదు.. పైగా సంవత్సరంన్నర గడిచినా విజయ్ నుండీ మరో సినిమా రాలేదు. దీంతో ఇతని క్రేజ్ పడిపోయినట్టే.. అని కామెంట్లు చేస్తున్నవారు కూడా లేకపోలేదు.అయితే నిన్న జరిగిన 'జాతిరత్నాలు' ప్రీ రిలీజ్ వేడుకని బట్టి అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని  తేలిపోయింది. వరంగల్ కు మన రౌడీ.. విజయ్ దేవరకొండ వస్తున్నాడని తెలియగానే..అక్కడ మొత్తం జనసందోహంతో నిండిపోయింది.


ఏకంగా 35వేల మంది తరలివచ్చారంటే.. మామూలు విషయం కాదు. వారిని కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కాదు.. పైగా లాఠీచార్జీ కూడా చేయాల్సి వచ్చింది.ఇక యూట్యూబ్ లో విజయ్ స్పీచ్ కు.. ఒక్కరోజు కూడా గడవకముందే 1 మిలియన్ వ్యూస్ నమోదవ్వడం మరో రికార్డు.పైగా విజయ్ నటిస్తున్న 'లైగర్' మూవీ టాటూలు కూడా వేయించుకుని చాలా మంది ఈలలు,గోలలు చేశారు.కాబట్టి విజయ్ స్టార్ డం మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ఇదే ఏడాది విజయ్ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కాబట్టి.. అక్కడ కూడా హిట్ కొడితే.. ప్రభాస్ ని మించి విజయ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయం. ఎందుకంటే విజయ్ కి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.ఇంస్టాగ్రామ్ లో ఏ దక్షిణాది నటుడికి లేనంత ఫాలోయింగ్ విజయ్ కి వుంది.దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు విజయ్ క్రేజ్ ఎటువంటిదో...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: