అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి రాబోతున్న మరో యంగ్ హీరో..ఫిట్నెస్ తోనే కుమ్మేశాడుగా..!!
ఇక త్వరలోనే అల్లు ఫ్యామిలీ నుంచే మరో యువ హీరో రానున్నట్లు సమాచారం.. అల్లు అర్జున్ కజిన్ అయినటువంటి విరన్ ముత్తంశెట్టి అనే యువకుడు చాలా కాలంగా వెండితెరపై ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ యువకుడు బతుకు బస్టాండ్ అనే కథతో రెడీ అవుతున్నాడు. IVR అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.విరన్ కు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ అంటే చిన్నప్పటి నుంచి విరన్ కు చాలా క్లోజ్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అల్లు అర్జున్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు.
ఇక మనోడు ఫిట్నెస్ తో కూడా షాక్ ఇస్తున్నాడు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న విరన్ ఇప్పుడు సినిమా కోసం చాలా తగ్గిపోయి ఓ వర్గం వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాడు.ఇక విరన్ చేయబోయే మొదటి సినిమా బస్ స్టాండ్. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు IVR అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విరన్ ఫాదర్ కు ముత్తం శెట్టి అనే ప్రొడక్షన్ హౌజ్ కూడా ఉంది. అందులోనే అల్లు అర్జున్ పుష్ప తెరకెక్కుతోంది..మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో పాటు ఈ సినిమాను సంయక్తంగా నిర్మిస్తున్నారు..ఇక ఆగస్టు 13 న పుష్ప సినిమా విడుదల కానుంది..!!