పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురైన నాగచైతన్య !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మధ్య గ్యాప్ ఉండటంతో ఎదో ఒక సందర్భంలో వీరిద్దరి మధ్య చిన్నచిన్న నెగిటివ్ కామెంట్స్ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే పవర్ స్టార్ అభిమానులకు నాగచైతన్య అభిమానులకు ఎటువంటి అంబంధం లేదు.


అయితే ఇప్పుడు అనూహ్యంగా పవన్ అభిమానులు నాగచైతన్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలా పవన్ అభిమానులు చైతూ అభిమానులను టార్గెట్ చేయడానికి ఈమధ్య విడుదలైన నాగచైత్య నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీకి సంబంధించిన వీడియో.


విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చైతన్య మహేష్ బాబు అభిమాన సంఘ అధ్యక్షుడుగా కనిపిస్తాడు.2000 సంవంత్సరం ప్రాంతానికి చెందిన ఈమూవీ కథలో చైతన్య అప్పట్లో విడుదలైన ‘ఒక్కడు’ మూవీ విడుదల సందర్భంగా చైతూ మహేష్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తున్న సీన్ కు సంబంధించిన వీడియోను వ్యూహాత్మకంగా లీక్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ముఖ్యంగా మహేష్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.


ఈ వీడియోను మిగతా హీరోల అభిమానులు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ వీడియో పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య తన పాత్ర స్వభావం రీత్యా ఒక టాప్ హీరో అభిమానిగా కనిపించాలి అంటే తన తండ్రి నాగార్జున అభిమానిగా కనిపించకుండా ఇలా మహేష్ బాబు అభిమానిగా ఎందుకు అత్యుత్సాహం చూపెడుతున్నాడు అంటూ పవన్ అభిమానులు చైతన్యను టార్గెట్ చేయడం వెనుక మరి ఏదైనా వ్యూహం ఉందా అంటూ కొందరు షాక్ అవుతున్నారు. అదేవిధంగా పవన్ అభిమానులు ఈ మూవీ దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూకొందరు పవన్ అభిమానులు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు చాల మందిలో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇలాంటి కామెంట్స్ పవన్ అభిమానుల దగ్గర నుండి వస్తాయని చైతన్య కూడ ఊహించి ఉండడు..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: