మన తెలుగు సినిమాలలో అదిరిపోయే ట్విస్ట్ వున్న సినిమాలు ఏంటో తెలుసా..!

Divya
మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సినిమాలు ఉంటే, మరికొన్ని మాస్ సినిమాలు ఉంటాయి. మరికొన్ని కామెడీ సినిమాలు ఉంటే, మరికొన్ని యాక్షన్ డ్రామా సినిమాలు ఉంటాయి.. ఇక ఇవన్నీ పక్కనపెడితే ప్రేక్షకుల మదిలో ఉద్రిక్తత నెలకొల్పే చిత్రాలకే ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు ఈ కాలంలో.. అంతేకాకుండా ఈ సినిమాలో ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది . ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్విస్ట్ సినిమాలు మన తెలుగు సినీ ఇండస్ట్రీలో  లో ఎన్నో ఉన్నాయి.. అయితే అందులో మరీ ముఖ్యంగా ఒక ఐదు డిఫరెంట్ ట్విస్ట్ కలిగి ఉన్న సినిమాలను ఇప్పుడు చూద్దాం..

రంగస్థలం :
మొదటి నుండి ఫణీంద్ర భూపతి విలన్ ని గా చూపిస్తూ, దక్షిణామూర్తిని మంచివాడిగా చూపిస్తాడు దర్శకుడు. అయితే చివరిలో హీరో అన్నయ్య కుమార్ బాబు ని చంపేసి, దక్షిణామూర్తి విలన్ అని రివిల్ చేస్తారు. ఈ ట్విస్ట్ అదిరిపోయేలా ఉంది ఈ సినిమాలో.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

బాహుబలి :
నమ్మకస్తుడైన కట్టప్ప చివరికి బాహుబలి నే చంపుతాడు అని ట్విస్ట్ చూసేవారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇక ఫస్ట్ పార్ట్ మొత్తం కట్టప్ప బాహుబలి ని చంపడం  ఏంటి..? అనే పాయింట్ తోనే ముగుస్తుంది. ఇక ఆ తర్వాత ఎందుకు కట్టప్ప బాహుబలి ని చంపాడు అనే ప్రశ్నతో ప్రేక్షకులు అదే క్యూరియాసిటీ తో రెండేళ్లు ఎదురుచూశారు. ఇక పార్ట్ 2 సినిమా చూసి సాటిస్ఫై అయ్యారు. ఇంత గొప్ప ట్విస్ట్ ఇవ్వగల కెపాసిటీ కేవలం రాజమౌళి కి మాత్రమే ఉందేమో..

ఆర్ ఎక్స్ 100 :
మొట్టమొదటిసారి ఒక హీరోయిన్ ను విలన్ గా చూపించి, ప్రేక్షకులను అలరించాడు దర్శకుడు. నాకు తెలిసి ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు.

C/o కంచరపాలెం :
వెంకటేష్ మహా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలు ఒకేసారి నాలుగు స్టోరీలు నడుస్తాయి. దేనికదే డిఫరెంట్ నేపథ్యంలో సాగుతుంటాయి. ఫైనల్ గా ఇవన్నీ ఒకే వ్యక్తి స్టోరీ అని క్లైమాక్స్లో రివీల్ చేశాడు దర్శకుడు. అంతలా ఈ సినిమాలు ట్విస్ట్ అదిరిపోయింది..

పోకిరి:
ట్విస్ట్ లలో అదిరిపోయే ట్విస్ట్ అంటే ఇదేనేమో.. ఫస్ట్ హాఫ్ వరకు మహేష్ ను పోకిరిగా, పండుగాడి గా చూపిస్తూ, ఆ తరువాత నాజర్ చేత నా కొడుకు కృష్ణ మనోహర్ ఐపీఎస్ అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రెడిట్ కేవలం పూరి జగన్నాథ్ కు మాత్రమే దక్కింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: