ప్రభాస్ ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా నటించనున్న బాలీవుడ్ స్టార్ హీరో..??

Anilkumar
బాహుబలి, సాహో సినిమాలతో బాలీవుడ్ ఇండ్రస్టీ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రావుత్ డైరెక్షన్లో 'ఆదిపురుష్' సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే . ఈ మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి టాక్ ఆఫ్ ది ఇండియన్ మూవీ అయింది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై పూటకో అప్‌డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసమే దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

 మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన రాముడి తండ్రైన దశరథుడి పాత్రలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటిస్తున్నట్టు వార్తులు వస్తున్నాయి..ఇదిలా ఉంటె ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ డ్రామా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడం, మొదటి రోజే సెట్ కాలిపోవడం, సెట్ మళ్ళీ కట్టేయడం కూడా అయిపోయింది. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఫిక్స్ అవ్వలేదు. అనుష్క శర్మ, పరిణీతి చోప్రా, అదితిరావు హైదరీ వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఫైనల్ డెసిషన్ మాత్రం వెలువడలేదు.అయితే.. 'ఆదిపురుష్'లో మరో ముఖ్యపాత్ర అయినటువంటి లక్ష్మణుడి క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ లో విక్కీ కౌషల్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. ప్రభాస్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి విక్కీ అయితే పర్ఫెక్ట్ అనుకున్న డైరెక్టర్ ఓం రౌత్ విక్కీని కలిసాడని, విక్కీ కూడా దాదాపుగా ఒకే చెప్పేసినట్లేనని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అక్కడే 'ఆది పురుష్, సలార్' షూటింగ్స్ లో పాలుపంచుకుంటూ బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు.ఇక తదుపరి సినిమా ఎలాగూ హృతిక్ తో అంటున్నారు కాబట్టి మనోడు ఇంకొన్నాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడం ఖాయం. అందుకే అక్కడ ఇల్లు కూడా కొనేశాడట..మొత్తానికి బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగిపోయిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: