తెలుగులో సూపర్ హిట్ అయిన రీమేక్ సినిమాలు ఇవే..!?
ఇక ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లుగా నటించిన బిల్లా సినిమా కూడా బాలీవుడ్ “డాన్” కి రీమేక్. ఈ సినిమా డాన్ అంత విజయం సాధించకపోయినా మంచి టాక్ నే తెచ్చుకుంది. ఒరిజినల్ డాన్ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మోడిఫై చేయడంతో కొంత ఒరిజినాలిటీ దెబ్బతింది. మీనా, విక్టరీ వెంకటేష్ జంటగా నటించిన దృశ్యం సినిమా తెలుగునాట, తమిళనాట కూడా బాగా ఆకట్టుకుంది. కానీ, ఇది మలయాళం దృశ్యం సినిమా కి రీమేక్.
అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా చంద్రముఖి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ సినిమా మలయాళంలోని మణిచిత్రతజ్హు సినిమాకి రీమేక్. తమిళనాట కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో ఈ సినిమాను రూపొందించారు. అదే పేరుతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఈ సినిమా ను రీమేక్ చేసారు. మలయాళంలో సూపర్ హిట్ అయినా ప్రేమమ్ సినిమాను అదే పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేసారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా వచ్చిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సూపర్ హిట్ అయింది. వాస్తవానికి ఇది బాలీవుడ్ సినిమా మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్ కి రీమేక్. కామెడీ ఎమోషనల్ ఫామిలీ డ్రామా గా ఈ సినిమా ను తెరకెక్కించారు. బాలీవుడ్ సినిమా కహాని ని తెలుగులో అనామికగా దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేసారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార లీడ్ రోల్ పోషించారు.