'హరిహర వీరమల్లు' టీజర్ చూసి దర్శకుడు క్రిష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కొడుకు అకిరా..??
సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ సినిమాలో పవన్ లుక్ పై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. మహేష్ బాబుతోపాటు, పవన్ వీరాభిమాని నితిన్ కూడా ఈ గ్లింప్స్ చూసి అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి అందరూ పవర్ స్టార్ ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ లుక్ చూసి బన్నీ, సాయిధరమ్ తేజ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి వీరమల్లుగా తన తమ్ముడి గెటప్ చూసి అద్భుతంగా ఉందని అన్నాడు. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడట.అయితే.. అందరి కంటే ఎక్కువ పవన్ కొడుకు ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడట.
రేణుదేశాయ్ - పవన్ కుమారుడు అకీరా నందన్ హరిహర వీరమల్లుగా తన తండ్రిని చూసి గూస్ బంస్ అయ్యాడట. ఈ గెటప్ లో మీ లుక్ కేక డాడీ, ఈ సినిమా కోసం నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని అన్నాడు. గ్లింప్స్ లో బల్లెం పట్టుకుని యుద్ధ రంగంలోకి దిగిన తీరు అమోఘం అని స్పందన తెలియజేశాడు.ఇక, దర్శకుడు క్రిష్ ను ఆకాశానికి ఎత్తేశాడు అకీరా. మా నాన్నను ఓ రేంజ్ లో చూపించారని, మరి, నాతో ఎప్పుడు సినిమా తీస్తారని కూడా అడగడం విశేషం..ప్రస్తుతం అకిరా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా పరంగా తెగ వైరల్ అవుతున్నాయి...!!