హృతిక్ రోషన్ మాజీ భార్య ఆ యంగ్ హీరో తో లవ్ లో ఉందా..?
పద్నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత తమ మధ్య రొమాంటిక్ యాంగిల్‌కు స్వస్తి చెప్పేసి, 2014లో విడాకులు తీసుకున్నారు. హృతిక్, సుసానే ఖాన్ చిన్ననాటి స్నేహితులు. పెద్దయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక కంగన తో ఎఫైర్ తరువాత కంగన కి హృతిక్ మధ్య చెడింది.. ఆ తర్వాత వారి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి అందరికి తెలిసిందే.. కంగన అయితే హృతిక్ ని టార్గెట్ చేస్తూ పెద్ద పోరాటమే చేసింది.. ప్రస్తుతం ఇష్యూ కొద్దిగా సద్దుమనిగినా ఇప్పటికీ ఛాన్స్ దొరికితే కంగన హృతిక్ ని ఏకిపారేస్తూ ఉంటుంది..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నటుడు అలీ గోని సోదరుడు అర్స్లాన్ గోనితో ఆమె ప్రేమలో పడింది. 'జియా ఔర్ జియా' మూవీలో నటించిన అర్స్లాన్తో సుసానే సన్నిహితంగా మెలగుతోందని చెప్పుకుంటున్నారు. "ఆరు నెలలుగా వారు ఒకరినొకరు తెలుసుకుంటున్నారు. టీవీ ఇండస్ట్రీకి చెందిన కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారు తొలిసారి కలుసుకున్నారు. అయితే ఇటీవల వారు పరస్పరం సన్నిహితులయ్యారు." అని సుసానే సన్నిహితులు తెలిపారు. "వారి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారు కేవలం ఫ్రెండ్స్ కాదనీ, అంతకంటే ఎక్కువ అనుబంధం వారి మధ్య ఏర్పడిందనీ తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ఇద్దరూ తరచూ కలుసుకుంటున్నారు." అని కూడా వారు చెప్పారు.