మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు నటుడిగా విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచడంతో పాటు మిడిల్ రేంజ్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది.గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడంతో పాటు నటుడిగా విజయ్ దేవరకొండ రేంజ్ ను పెంచాయి. ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది.అయితే జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న నవీన్ పోలిశెట్టిని మరో విజయ్ దేవరకొండ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ సాధించిన నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారడు.జాతిరత్నాలు సినిమాలో అన్ని ఎమోషన్స్ ను అద్భుతంగా పండించి ఆ సినిమా సక్సెస్ కు నవీన్ పోలిశెట్టి ప్రధాన కారణమయ్యాడు. నవీన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా హిట్టైతే మాత్రం నవీన్ సులువుగా విజయ్ దేవరకొండ రేంజ్ ను అందుకోగలుగుతారని చెప్పవచ్చు.ఇంకా చెప్పాలంటే విజయ్ దేవరకొండ కి పోటీగా కూడా నిలవవచ్చు.జాతిరత్నాలు సినిమా నవీన్ వన్ మ్యాన్ షో అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా నవీన్ గొప్ప స్టార్ హీరో అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...