చిరంజీవి టైటిల్ ను బయట పెట్టిన పూరి !
‘టెంపర్’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న పూరి జగన్నాథ్ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి 150 సినిమాపై అధికారికంగా స్పందిoచడమే కాకుండా చిరంజీవి సినిమా గురించి తాను రిజిస్టర్ చేసిన టైటిల్ విషయం కూడ బయటపెట్టాడు. చిరంజీవి సినిమాకు తాను దర్శకత్వం వహించే ఆలోచన ఇప్పటిది కాదని తానూ అమితాబ్ బచన్ తో ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమా తీస్తున్న రోజులలో అమితాబ్ స్వయంగా చిరూతో 150 సినిమాకు సంబంధించి తన ప్రస్తావన తీసుకువచ్చారని అంతేకాదు అమితాబ్ చిరంజీవి సినిమాలో ప్రత్యేక పాత్రను చేస్తాను అని మాట ఇచ్చాడని అలనాటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు పూరి.
అయితే ప్రస్తుతం చిరంజీవి 150 సినిమాకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని తనకు చిరంజీవితో కలిసి సినిమా చేయాలని ఉన్నా అటువంటి చర్చలు ఏమి మామధ్య జరగలేదని క్లారిటీ ఇచ్చాడు పూరి. అయితే ఇటువంటి వార్తలు మీడియాలో రావడానికి తన గురువు రామ్ గోపాల్ వర్మచిరంజీవి ని ఉద్దేశిస్తూ చేసిన ట్విట్ అంటూ ప్రస్తుతానికి ఈవార్తలపై తెరదించాడు పూరి.
అయితే తాను చిరంజీవి నుంచి వచ్చే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నానని తన మనసులోని కోరికను మరోసారి బయటపెట్టాడు పూరి. అయితే తాను చిరంజీవి కోసం ఎప్పుడో ‘ఆటో జాని’ అన్న టైటిల్ ను రిజిస్టర్ చేసానని, కాని ఇప్పటి పరిస్తుతులలో చిరంజీవికి ఆటైటిల్ సూట్ కాదని అభిప్రాయపడ్డాడు పూరి.
చిరంజీవి అడిగితే తాను ఆయనకోసం ఒకవెరైటీ కథను సిద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటూ ప్రస్తుతం తానుమటుకు ఛార్మితో తీస్తున్న ‘జ్యోతి లక్షి’ సినిమా విషయాలలో బిజీగా ఉన్నాను అని క్లారిటీ ఇచ్చాడు..